మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ.. తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఈ కేసులో కీలక సాంకేతిక ఆధారాలు సేకరించామని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. హత్య జరిగిన ప్రదేశానికి అవినాష్ రెడ్డి వెళ్లారని తెలిపింది. ఇదిలా ఉండగా అవినాష్ బెయిల్ పిటిషన్పై విచారణ మధ్యాహ్నం 2.30కి వాయిదా పడింది.