దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బూస్టర్ డోసులను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా కార్బోవ్యాక్సిన్ ను బూస్టర్ గా అందించనుంది. తొలి రెండు డోసుల్లో కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ ఏది తీసుకున్నా బూస్టర్ డోసుగా కార్బోవ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపింది.