శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణ పనులకు నేడు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.4,362 కోట్ల వ్యయంతో 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను 30 నెలల్లో నిర్మించనున్నారు. అలాగే, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్, రూ.176 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్, రూ.852 కోట్లతో మహేంద్ర తనయ రిజర్వాయర్ కు సీఎం భూమి పూజ చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa