ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థిగా ఉన్నప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించా..,,సుందర్ పిచాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 10:50 PM

దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ పాల్గొన్న గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ.. విశాఖ నగరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించానని, అప్పటికి విశాఖ ఓ చిన్న తీర నగరమని అన్నారు. కానీ, ఈ రోజు గ్రోత్ ఇంజిన్‌గా మారిందని ఆయన ప్రశంసలు కురిపించారు. విశాఖ త్వరలో ప్రపంచానికి ముఖద్వారంగా మారుతుందని ఆయన అభివర్ణించారు. ఇండియాకు వచ్చిన ప్రతిసారి తాను మార్పులను చూస్తున్నానని, ఇప్పుడు ఇందులో ఎలాంటి తేడా లేదని అన్నారు.


‘‘విద్యార్థిగా ఐఐటీ-ఖరగ్‌పూర్‌‌లో చదువుకున్న నేను చైన్నై నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం మీదుగా వెళ్లేవాడ్ని.. అప్పుడు నాకు బాగా గుర్తింది విశాఖపట్నం చిన్న తీర నగరం.. కానీ, ఇప్పుడు అదే నగరం ఏఐ గ్లోబల్ హబ్‌గా మారడానికి సిద్ధమవుతోంది.. భారత్‌లో మౌలిక సౌకర్యాల పెట్టుబడుల్లో భాగంగా 15 బిలియన్ డాలర్లతో వైజాగ్‌లో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తున్నాం.. గిగావాట్ వాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యంతో పూర్తిస్థాయి ఏఐ హబ్ నిర్మాణంతో సముద్రం అడుగున కేబుల్ గేట్ వే ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి’’ అని తెలిపారు.


ప్రస్తుతం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, విశాఖపై గతంలోనూ ఆయన ప్రశంసలు కురిపించారు. దీనిని అందమైన నగరంగా అభివర్ణించారు. విశాఖలో రూ.1.35 లక్షల కోట్లతో గూగుల్ దేశంలోనే తొలి ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తోన విషయం తెలిసిందే. విశాఖ గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే భారతీయులకు ఉద్యోగాలు, ఏఐ కటింగ్‌ ఎడ్జ్‌‌లో ప్రయోజనాలు అందుతాయని అన్నారు. దీని ద్వారా వచ్చే అవకాశాలను విద్యార్థులు, ప్రజలు వినియోగించుకునేలా నైపుణ్య శిక్షణలోనూ గూగుల్ పెట్టుబడి పెట్టనుందనిట్లు ఆయన వెల్లడించారు. సముద్ర గర్భంలో ఫైబర్ ఆకట్ికల్ కేబుల్ మార్గంతో భారత్-అమెరికా మధ్య ఏఐ అనుసంధానం పెంచేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా, విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. భూసేకరణ సమస్య కొలిక్కి రావడంతో త్వరలోనే శంకుస్థాపన నిర్వహించనున్నారు. భూసేకరణకు అడ్డుచెప్పిన ఒక్క రైతు.. తాజాగా ఇచ్చేందుకు అంగీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa