కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా 'వందే భారత్' రైళ్లను ప్రవేశపెట్టిెంది. కాగా, త్వరలో స్లీపర్ కోచ్ లతో కూడిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రవేశపెట్టనున్నట్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు మంచి ఆదరణ లభిస్తుండడంతో స్లీపర్ కోచ్ లు సైతం అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ నిర్ణయించిందని తెలిపారు. త్వరలో 80 స్లీపర్ కోచ్ లు సిద్ధం చేస్తామని వివరించారు.