గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ అప్పులు ఏడాది కాలంలో భారీగా పెరిగినట్లు బ్లూమ్ బర్గ్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి అదానీ గ్రూప్ లోని 7 కంపెనీల రుణాలు గతేడాది తో పోలిస్తే 20.7% పెరిగి రూ.2.3 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. దీనిలో అంతర్జాతీయ బ్యాంకుల వాటా 29 శాతం ఉందని పేర్కొంది. అలాగే, దేశీయంగానూ అప్పులు భారీగానే ఉన్నాయని, ఎస్బీఐకి రూ.27 వేల కోట్లు చెల్లించాల్సి ఉందంటూ తెలిపింది.