వేసవిలో ప్రజలకు చల్లని మంచినీరు అందించే సదుదేశ్యంతో గ్రామ ప్రధాన కూడలిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన మండపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం, కార్యదర్శిని అభినందిస్తున్నానని ప్రజల దాహార్తిని తీర్చడం ముదావహమని కైకలూరు శాసనసభ్యుడు దూలం నాగేశ్వరరావు (డిఎన్నార్) పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం మండవల్లి ప్రధాన కూడలిలో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామకుఁ ప్రసాద్, జెడ్పీటీసీ ముంగర విజయనిర్మల, గ్రామ సర్పంచ్ మెండా ఝాన్సీ, మండల వైకాపా అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు బేతపూడి యేషావురాజు పాల్గొన్నారు.