ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2023, 12:10 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు నకరికల్లు మండలం గుండ్లపల్లి కి చెందిన షేక్ అమీర్ ఖాన్, సురజ్, నాగూర్ ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగా నకరికల్లు వద్ద ఎదురుగా వస్తున్న లారీ అదుపు తప్పి ఢీ కొట్టింది. దీంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది వారిని నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నకరికల్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa