ఒడిశా బాలాసోర్ జిల్లాలోని సోరోబ్లాక్ బంద్ సాహి గ్రామానికి చెందిన ఓ 11 ఏళ్ల బాలుడికి ఆడ కుక్కతో, ఏడేళ్ల పాపకు ఓ మగ కుక్కతో వివాహం జరిపించారు. మైనర్లకు దుష్టశక్తులను పారదోలేందుకే ఇలా వీధి కుక్కలతో పెళ్లి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. హో తెగకు చెందిన గిరిజనులు తమ పిల్లల దవడలపై దంతాలు కనిపించడం అశుభంగా భావించి దుష్టశక్తులు దరి చేరకూడదని ఇలా కుక్కలతో పెళ్లి జరిపించారని తెలుస్తోంది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.