తాండూర్ మున్సిపల్ పరిది లోని 26వ వార్డులో కంటి వెలుగు శిబిరం ను బుధ వారం తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రారంభం చేశారు. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న కంటి వెలుగుతో పేదల కంటి చూపు పదిలంగా మారుతోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం 26వ వార్డు గుమస్తా నగర్ లో ప్రభుత్వం ద్వారా వార్డు కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ ఆధ్వర్యంలో కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరై జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సిములు తో కలిసి కంటి వెలుగు శిబిరం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధత్వ రహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంటి వెలుగును అమలు చేస్తున్నారని అన్నారు. కంటి వెలుగుతో పేదల కంటి చూపు పదిలంగా మారుతోందని అన్నారు. కంటి వెలుగును అందరూ సద్వినియోగం చేసువాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మైన్ విఠల్ నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మైన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు సంగీత ఠాకూర్, సోమశేఖర్, వార్డు ఇన్చార్జీలు బాలకృష్ణారెడ్డి, శీనుయాదవ్, యోగానంద్, శ్రీధర్, సీనియర్ లీడర్లు శ్రీనివాస చారి, నగరేశ్వ ర మందిర్ చైర్మైన్ కుంచెం మురళీధర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.