జామి మండలంలో పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యటించారు. ముందుగా మండలంలోని గోడుకొమ్ము గ్రామంలో ఉపాధి హామీ పనులు పరిశీలించారు. వేతనదారులతో కాసేపు మాట్లాడారు. తరువాత గ్రామంలో ప్రధమిక పాఠశాలలో వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం అలమండ సచివాలయం విజిట్ చేసి లేఅవుట్ లో ఇళ్లు నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం జి. సింగవరం స్టోన్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సతీష్, తహసీల్దారు హేమంత్ కుమార్, మండల అధికారులు పాల్గొన్నారు.