దత్తిరాజేరు మండలంలోని గుచ్చిమి పంచాయతీ శివారు భోజరాజపురం గ్రామంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు కడబండి రమేష్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా వారి అనుమతి గోడలకు స్టిక్కర్లు అంటించారు. అదేవిధంగా మిస్డ్ కాల్ ఇప్పించారు. కార్యక్రమంలో కన్వీనర్లు, గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.