అగ్ని ప్రమాదాలపై ఆసుపత్రి సిబ్బందికి అవగాహన కల్పించారు. బుధవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గజపతినగరం అగ్నిమాపత్ యంత్రం అధికారి ఎం. ఎస్. వి. రవి ప్రసాద్ శ్రీనివాస నర్సింగ్ హోమ్ లో ప్రథమ దశలో ఉన్న అగ్ని ప్రమాదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగే ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలో సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ బి. ఎస్. ఆర్. మూర్తి, ఆసుపత్రి, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.