చిత్తూరు జిల్లాలో వ్యవసాయ మరియు పశుసంవర్థక పాలిటెక్నిక్ కాలేజి ల నిర్మాణంనకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసు లు, ట్రైనీ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ తో కలసి చౌడేపల్లి లో వ్యవసాయ పాలి టెక్నిక్ కాలేజి, సదుం లో వెటర్నరీ పాలిటె క్నిక్ కాలేజిల నిర్మా ణంనకు సంబంధిం చిన అంశాలపై తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవి, ఎస్టేట్ ఆఫీసర్ నగేష్, గుంటూరు ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సైంటిస్ట్ డా. సుబ్రహ్మ ణ్యం, ప్రిన్సిపాల్ డా. నసీరుద్దీన్, పలమనేరు ఆర్ డి ఓ శివయ్య, కలెక్టరేట్ ఈ మరియు జి సెక్షన్ సూపరింటెం డెంట్ లు మురళీ, వెంకటేశ్వర్, సదుం, చౌడేపల్లితహసీల్దార్లు చంద్రశేఖర్, మాధవ రాజు తది తరులతోచర్చించారు.