మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని మంగళవారం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే. అయితే ఈ మధ్యలో సీబీఐ ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని ఎంపీకి ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో బుధవారం అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు.