మోదీ ని గద్దె దింపి దేశాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు సీపీఐ నేతలు. నంద్యాల జిల్లా డోన్ లో బుధవారం సీపీఐ నేతలు ఇంటింటి తిరిగి కేంద్ర ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కరపత్రాలను పంచుతూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. రామాంజనేయులు మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది కాబట్టి ప్రతిఒక్క పొరుగు గొంతెత్తి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. లేదంటే మనందరి భవిష్యత్తు చీకటిమయం అవుతుందని వారు అన్నారు. దేశసంపదను సంపన్నులకు దోచిపెడుతున్న మోదీ, అమిత్ షా లను సాగనంపే సమయం దగ్గర పడిందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు సుంకయ్య , రాముడు , మండల కార్యదర్శి పులి శేఖర్, దళిత నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.