తమిళనాడు రాజధాని చెన్నైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బరిమునలోని ప్రథమకరణ్ వీధిలో పాత నాలుగు అంతస్థుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. భవనం పునరుద్ధరణ పనులు జరుగుతుండగా కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రద్దీగా ఉండే బరిమున ప్రాంతంలో భవనం కుప్పకూలడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.