వాస్తు ప్రకారం మన ఇంట్లో బాత్రూం ఉత్తరం లేదా వాయువ్యంలో ఉండాలని పండితులు పేర్కొంటున్నారు. బాత్రూంలో వాటర్ బకెట్ ఎప్పుడూ నింపి ఉంచాలి. ఖాళీగా ఉంటే అది బోర్లించి పెట్టుకోవాలి. బాత్రూం డోర్ ముందు అద్దం ఉంచకూడదు. ట్యాప్స్ లీక్ కాకుండా చూసుకోవాలి. చెక్క తలుపు మాత్రమే బాత్రూంకు అమర్చుకోవాలి. బాత్రూం గోడ పూజ, వంటగదులకు ఉమ్మడిగా ఉండకూడదు. పాత చెప్పులు, రాలిన జుట్టు బాత్రూంలో ఉంచకూడదంటున్నారు.