శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలోని విమాన గోపురానికి బంగారం పూత పూయించే సమయంలో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ‘గోవిందరాజ స్వామి ఆలయ పనుల్లో బంగారం పక్కదారి పట్టిందని హిందూ జనశక్తి సంస్థకు చెందిన శ్రీ లలిత్ కుమార్, శ్రీ ఆదిపట్ల కళాపీఠం అధ్యక్షురాలు అవాస్తవ ఆరోపణలు చేశారు. తమ ఉనికిని చాటుకునేలా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.’ అని టీటీడీ తెలిపింది.