ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం భారత్‌లో 142.86 కోట్ల మంది జనాభా ఉన్నారని, చైనా జనాభా 142.57 కోట్ల మంది అని తెలిపింది. కాగా 340 మిలియన్లతో అమెరికా మూడో స్థానంలో ఉందని వెల్లడించింది. చైనాను భారత్ ఎప్పుడు దాటిందో స్పష్టంగా వెల్లడించకపోయినా.. ప్రస్తుతం ఇండియాలోనే జనాభా ఎక్కువని తెలిపింది.