పాత పెన్షన్ స్కీమ్ (OPS), ఆరోగ్య హక్కు (RTH) చట్టాన్ని విజయవంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, దీనిని ఎవరూ ఆపలేరని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం అన్నారు. రాజ్‌హెల్త్ పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గెహ్లాట్ ప్రసంగించారు. తమ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ.. ఏదో ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించక తప్పదని అన్నారు.కాంగ్రెస్ తమ పథకాలను చాలా వరకు ఆమోదించాలని కేంద్రంపై, ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచుతుందని గెహ్లాట్ తెలిపారు.ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా నియమించబడిన 1763 మంది వైద్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా బుధవారం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రసంగించారు.