పెళ్లి మండపంలోనే నూతన వధూవరులపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన బిహార్‌లో జరిగింది. బస్తర్ జిల్లాలోని అంబల్ ప్రాంతంలో బుధవారం రాత్రి పెళ్లి వేడుక జరుగుతుండగా 7 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కరెంట్ సరాఫరా నిలిచిపోయింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఓ దుండగుడు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుపై యాసిడ్ పోశాడు. ఘటనలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. మరో పది మందికి సైతం గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa