జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పట్టాభిపురంలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దు ఘర్ కం షాదీ ఖానా లో బుధవారం రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమాన్ని కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసమని, చెడుకు దూరంగా నిరంతరం అల్లాను స్మరించుకుంటూ మంచి కోసం తపించే మాసమ న్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.