గుంటూరు: ఇంటి నుంచి వెళ్ళిన అల్లుడు కనిపించడం లేదని మామ బుధవారం అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పిడుగురాళ్ల కు చెందిన తిరుపతి శ్రీనివాసరావు (40) అలియాస్ శ్రీను బేల్దారి పనులకు వెళ్లే వాడు. ఈనెల 11న శారదా కాలనీలో ఉంటున్న మామ కొండయ్య ను చూసేందుకు వచ్చాడు. అనంతరం ఊరెళ్తానని చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లాడు. అప్పటినుంచి సొంతూరు కి గానీ, శారదా కాలనీలోని ఇంటికి గానీ రాలేదు. అల్లుడికి మూర్చలున్నాయని మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.