దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఈ కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన హోం క్వారెంటైన్లో ఉన్నారు. స్వల్ప కరోనా లక్షణాలతో రాజ్‌నాథ్ బాధపడుతున్నారని, డాక్టర్ల బృందం ఆయన్ను పరీక్షిస్తుందని అధికారులు తెలిపారు.