కబడ్డీ ఆటకు దిగిన మంత్రి కాలు పట్టుకుని ఈడ్చేశాడు ఓ యువకుడు. మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి జగదీష్ దేవరా నారాయణగఢ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. కూతకు వచ్చిన మంత్రిని పట్టుకునే క్రమంలో ఓ యువకుడు జగదీష్ కాలును గట్టిగా పట్టుకుని వెనక్కి లాగాడు. దీంతో కిందపడిన మంత్రి లేచి నవ్వుతూ బయటకి వచ్చేశారు. సదరు వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది