తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఒక్క రోజే 20 మంది విద్యార్థులను డీబార్ చేశామని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి దామ్లా నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి డిగ్రీ కళాశాలలో అత్యధికంగా 13 మంది, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 7 మంది చూచిరాతకు పాల్పడగా హైపవర్ కమిటీ గుర్తించి ఈ మేరకు చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.