కర్నాటక ఎన్నికల తరువాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల తరువాత ఏపీలో ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందని చెప్పారు. బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. విశాఖ ఉక్కు కేంద్రంగా కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఆయన మీడియాతో ఇలా మాట్లాడారు.