పాలకొల్లు లోని లక్ష్మీనగర్కాలనీకి చెందిన దళిత మహిళ పై దాడి చేసారు. ఈ ఘటనపై దళిత సంఘాల నాయకులు దాడికి పాల్పడిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.వివరాల్లోకి వెళ్ళితే..... మేరీ నివశిస్తున్న ఇంట్లోనే మరో భాగంలో ఉంటున్న కుటుంబం విద్యుత్ బిల్లు విషయమై ఆమెతో ఘర్షణ పడ్డారు. దాడిచేసి ఆమెను గాయపరచడంతో మేరీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు బుధవారం ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనంద ప్రకాష్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, ఖండవల్లి వాసు, పెద మధు తదితరులు పరామర్శించారు. వారు మాట్లాడుతూ, మేరీకి న్యాయం జరిగేవరకూ పోరాడతామన్నారు. దీనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు.