ప్రకాశం జిల్లా, దర్శి మండలంలోని తూర్పువీరాయపాలేనికి చెందిన ముప్పరాజు రమణయ్య(37) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్ళితే..... రమణయ్య మద్యం వ్యసనానికి బానిసై తిరుగుతున్నాడు. ఆస్తి పంపకాలు చేయాలని తల్లితండ్రులను కోరగా మద్యం సేవించటం మానుకోవాలని వారు సూచించారు. దీంతో మనస్తాపం చెందిన రమణయ్య క్షణికావేశానికి గురై ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.