ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరొనా కేసుతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యసిబ్బంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 20, 2023, 02:13 PM

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యసిబ్బంది కరొనా కేసుతో అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళ్ళితే.... , కోరుకొండ గ్రామం అంకాలమ్మ గుడి, సాయిబాబా గుడి సమీపంలో సుమారు 70 సంవత్సరాలు వృద్దురాలికి కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందని తేలడంతో స్ధానిక ఆరోగ్య సిబ్బంది బుధవారం మరో సారి ఆమెకు వైద్యఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‌ రిపోర్టు రావడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఆ వృద్దురాలు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్ళి జలుబు, ఒళ్ళునొప్పులని చెప్పడంతో అక్కడ వారు కోవిడ్‌ టెస్ట్‌ చేశారు. ఒక పాయింట్‌ పాజిటివ్‌ వచ్చినట్లు తెలియడంతో బుధవారం కోరుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్‌ రవిచంద్ర ఆధ్వర్యంలో ఆమె ఇంటికి వెళ్ళి మరోసారి కోవిడ్‌ చేశారు. నెగిటివ్‌ వచ్చిందని ఆమె ఆరోగ్యం బానే ఉందన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆమె నివాసం పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా శానిటేషన్‌ పనులు నిర్వహించామని పంచాయతీ కార్యదర్శి రమేష్‌బాబు తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com