నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... జ్యోతినగర్‌కు చెందిన ఇనగలూరు నరేష్ భార్య ఆదిలక్ష్మి (32) మంగళవారం తన నివాసంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా ఆదిలక్ష్మి ఫ్యానుకు వేలాడతుండటంతో పెద్దగా కేకలు వేసి చుట్టుపక్కల వారి సాయంతో కిందికి దించి చూశారు. అప్పటికే ఆదిలక్ష్మి మృతి చెందింది. సమాచారం అందుకున్న సీఐ గంగాధర్, ఎస్ఐ అయ్యప్ప సంఘటన స్థలాన్ని పరిశిలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త నరేష్‌తోపాటు ఇద్దరు కుమారులున్నారు. బుధవారం ఉదయం మృతురాలి తల్లి పెంచలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.