టీడీపీ యువనేత నారా లోకేష్, మంత్రి జయరామ్ కి విసిన సవాల్ స్వీకరించకుండా పొంతన లేని సమాధానాలు చెపుతున్నారని ఆలూరు టీడీపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘జయరాంకి లోకేష్ బాబు కాదు.. నేను సవాల్ చేస్తున్నా. ఐటీ ఇచ్చిన నోటీసులకు జయరామ్ సమాధానం చెప్పాలి. మంత్రి జయరాం కర్ణాటక మద్యం,పేకాట స్థావరాలు, ఇసుక లూటీ ,బియ్యం మాఫియా అందరికి తెలుసు. బాధిత రైతులకు మేము అండగా ఉంటాం. మేము అధికారంలోకి రాగానే.. రైతులకు కోల్పోయిన భూముల విషయంలో న్యాయం చేస్తాం’’ అని తెలిపారు.