టీడీపీ యువనేత నారాలోకేష్ యువగళం పాదయాత్ర ఈరోజు ఆలూరు నియోజకవర్గం నుంచి ఆదోని నియోజకవర్గంలోని ప్రవేశించింది. పాదయాత్రలో భాగంగా చేరువలోని గ్రామాలలో ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలను కలిశారు. కొద్దిసేపు అయన కూడా ఆ పనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పనిదినాలు, కూలీ రేట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని... మంచినీళ్లు, నీడ సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామాల నుంచి పనిచేసే ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించాలని లోకేష్‌ను ఉపాధి కూలీలు కోరారు.