అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల మామ, అల్లుడు అరెస్ట్ ఐన సంఘటన నూజివీడు పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... ఆరేపల్లి గాంధీ మూడేళ్లుగా ఏ పని చేయకుండా ఇంటి వద్దే ఉంటూ మద్యానికి బానిసై భార్యను, కుమారులను కొట్టేవాడని, ఈ నెల 18న ఇంట్లో ని సెల్‌ఫోన్‌ను, కోడిని అమ్మి ఆ సొమ్ముతో తాగి భార్య, కుమారుడితో గొడవ పడడంతో చిన్నకొడుకు అనిల్ కుమార్, తన మేనమామ వేముల శ్రీనివాసరావు అదేరోజు రాత్రి గాంధీని స్తంభానికి కట్టి కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో గాంధీ మృతి చెందాడు. నిందితులు పరారు కాగా వట్టి గుడిపాడులో నూజివీడు రూరల్ సీఐ అంకబాబు, ఆగిరిపల్లి ఎస్సై చంటి వారిని అరెస్టు చేశారన్నారు.