ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ అభిమానులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ కార్యకర్తలు ఈ ఏడాదంతా సైనికుల మాదిరిగా కష్టపడాలని పిలుపునిచ్చారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉండాలన్నారు.వచ్చే ఏడాది ఈ సమయానికి దుర్మార్గ పాలన అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.