డైవర్షన్ పాలిటిక్స్ నడపడం, జగన్‌కి వెన్నతో పెట్టిన విద్యని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాజ్యాంగ బద్దంగా, ప్రజాస్వామ్య బద్ధంగా సీఎం జగన్ ఎన్నికయ్యాడా? లేదా? అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన సీఎం అయితే, రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని సూచించారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉంటే సెప్టెంబరు నుంచి వైజాగ్‌లో పాలన చేస్తానని సీఎం జగన్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలని మోసం చేసేందుకు ఇలాంటి ప్రకటన చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం వెంటిలేటర్‌పై నడుస్తోందన్నారు.