వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ గురువారం ప్రశ్నించింది. ఎనిమిది గంటల పాటు ఆయనను విచారించారు. అవినాష్ రెడ్డితో పాటు ఉదయ్, వైఎస్ భాస్కర రెడ్డిలను కూడా సీబీఐ ప్రశ్నించింది. ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పును 25వ తేదీకి వాయిదా వేసింది.