హీట్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా మహారాష్ట్రలోని స్టేట్ బోర్డుకి అనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలలు శుక్రవారం నుండి మూసివేయబడతాయి అని ప్రభుత్వం తెలిపింది.ఇతర బోర్డుల పాఠశాలలు వాటి పాఠ్యాంశాలు మరియు కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మూసివేతపై నిర్ణయం తీసుకోవచ్చని పాఠశాల విద్యా శాఖ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.విదర్భ మినహా రాష్ట్రంలోని పాఠశాలలు జూన్ 15న పునఃప్రారంభమవుతాయని, విదర్భలోని పాఠశాలలు జూన్ 30 నుంచి పునఃప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.