శాంతిపురం మండల కేంద్రంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు సభ్యులు అధికారుల తీరును జడ్పీ ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు తెలిపితే పట్టించుకోవడం లేదని తెలియచేశారు. దీంతో మండల అధికారుల తీరుపై జడ్పీ ఛైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. అంగన్వాడీ, రెవెన్యూ అధికారుల పని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని శ్రీనివాసులు హెచ్చరింవారు.