పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసి చిత్తూరు అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కోరారు. చిత్తూరు నగరంలోని 43 వార్డు లో గురువారం పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా నిర్వహించిన నాయకులు మాట్లాడుతూ రాములు వారి గుడి వీధిలో కమ్యూనిటీ హాలు నిర్మించేందుకు సహకరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి పార్టీలు కచ్చితంగా కలిసి వచ్చినప్పుడు అండగా ఉండేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేను పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.