కోడెదూడల పెంపకంపై నిర్లక్ష్యం చూపరాదని పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. గంగాధర నెల్లూరు మండలం, మేనాటంపల్లి గ్రామంలో గురువారం పేయదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏపుగా ఉన్న దూడలను ఎం పిక చేసి రైతులకు బహుమతుల్ని ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా జే. డీ. మాట్లాడుతూ కోడెదూడల్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కోడె దూడలకు పాలు ఎక్కువగా పట్టిస్తే రైతులకు మంచి ధర వచ్చే అవకాశం ఉందన్నారు. మేలుజాతి పశువుల సంతతి కోసం ఆరోగ్యకరమైన కోడెల వీర్యం అవసరం ఉందన్నారు. మే నుంచి 75 శాతం రాయితీతో పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు.