నరసరావుపేట: ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యకు సంబంధించిన మొదటి దశ సీట్లు పూర్తి చేశామని గురువారం డీఈవో శ్యామ్యూల్ తెలిపారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు చేసుకున్న వారికి లాటరీ విధానంలో సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన పాఠశాలలో విద్యార్థులను తల్లిదండ్రులు 25 లోగా చేర్పించాలని చెప్పారు. పాఠశాలల నిర్వహకులు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిప్రవేశాలు కల్పించాలన్నారు.