గుంటూరు నగరంపాలెం అంజుమన్ సంస్థ వారి ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిమ్ సోదరులు ప్రార్ధనలు నిర్వకాహించుకునేందుకు ఏర్పాట్లను శుక్రవారం అంజుమన్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ కర్ణుమా , పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ , మేయర్ కావటి మనోహర్ నాయుడు, తూర్పు వైస్సార్సీపీ నాయకురాలు నూరిఫాతిమా తదితరులు పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం లో నే మెరుగైన సదుపాయాలు కల్పించినట్టు, నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పించారని ముస్లిం సోదరులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు వారు తెలిపారు.