మంగళగిరి నగరానికి చెందిన వైసిపి నాయకులు, శివాలయం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ మునగపాటి వెంకటేశ్వరరావు వైకాపా పార్టీకి శుక్రవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆర్కే కు లిఖిత పూర్వకంగా లేఖ వ్రాశారు. తాను, తన భార్య విజయలక్ష్మి వ్యక్తిగత కారణాల వలన పార్టీకి రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. తనను గుర్తించి శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. కాగా వైకాపా ని వీడి టీడీపీ లోకి మునగపాటి చేరనున్నట్లు పార్టీ శ్రేణులు చర్చనీయాంశమైంది.