పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో శుక్రవారం సాయంత్రం పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పర్యటస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి దరిశి వెంకటేశ్వరావు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, వాలంటీర్లు, గృహ సారధులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.