తెదేపా తోనే ముస్లిం మైనారిటీల సంక్షేమం సాధ్యమని పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు శుక్రవారం పెదకూరపాడు గ్రామంలోని ముస్లిం పేదలకు పవిత్ర రంజాన్ పర్వదినం పురస్కరించుకొని చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి అప్పటి ముఖ్య మంత్రి ఎన్టీఆర్ 1985 లోనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. షాదీ ఖానాల నిర్మాణం, ముస్లిం ఖబరిస్థాన్ ల అభివృద్ధి, యువత స్వయం ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలు వంటి పథకాలు అమలు చేసి ముస్లిం అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. తెదేపా హయాంలో అమలు చేసిన దుల్హన్, రంజాన్ తోఫా పథకాలను వైకాపా రద్దు చేసిందని విమర్శించారు. పాదయాత్రలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఓట్లు వేయించుకొని అధికారంలో వచ్చిన తర్వాత వారి సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. వారి వెంట స్థానిక తెదేపా నేతలు రమేష్, ముంతాజ్ పాల్గొన్నారు.