పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో పలు అంగన్ వాడీ సెంటర్లను శుక్రవారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ సెంటర్లలో రికార్డులను పరిశీలించి చిన్నపిల్లల విద్య, ఆరోగ్యం , గర్భిణీ స్త్రీ ల సంక్షేమం అంగన్ వాడీ సెంటర్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌష్టికాహారలోపనివారణే లక్ష్యంగా పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహార లోపం తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ పిల్లలు, మహిళలుకు పోషకాలతో కూడిన బలవర్ధకమైన సంపూర్ణ పోషణ పాలు, గుడ్లు ను ప్రభుత్వం అందిస్తూ స్త్రీ శిశు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. కావున పౌష్టికాహారం పంపిణీలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా బాధ్యతగా వ్యవహరించాలని అంగన్ వాడీ ఉద్యోగులకు తెలియజేశారు.