చేబ్రోలు మండలంలోని వీర నాయకుని పాలెంలో ప్రభుత్వం 1993లో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములలో గురువారం కొందరు మట్టి మాఫియా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు జిల్లా మైనింగ్, విజిలెన్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు ఫిర్యాదు చేశారన్న సమాచారం అందుకున్న మట్టి మాఫియా ప్రోక్లైనర్ లారీలతో అక్కడి నుంచి ఉడాయించారు. స్థానిక రెవిన్యూ అధికారులకు జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించగా అప్పటికే అసైన్డ్ భూముల్లో ఎటువంటి వాహనాలు లేనట్లు తెలిపారు. పూర్తి విచారణ జరిపి వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు.