పెందుర్తి నియోజకవర్గపరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో వై. యస్. జగన్మోహన్ రెడ్డి పాలన ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు, జీవీఎంసీ 95వ వార్డు సచివాలయం 500 పరిధి పొర్లుపాలెం గ్రామంలో శుక్రవారం నాడు పెందుర్తి నియోజకవర్గఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ , మరియు స్థానిక జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ఈ నాలుగేళ్లు పాలనలో ప్రజలకు ఎంత లబ్ది చేకూర్చమో ఎమ్మెల్యే వివరిస్తూ ఆయా కుటుంబాలలో పథకాల అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకొని. వారి సమక్షంలో ఇతర సమస్యలు కూడా తెలుసుకొని వాటిని పరిష్కారించే విధంగా అధికారులకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపర్తి మాధవరావు, ఆకుల గుణాకర్, పెదగాడి చిన్నారావు, రాపర్తి కాశీ, మింది రామునాయుడు, ఆకుల నాయుడు, కోన సూర్య ప్రకాష్, కుంచా భార్గవ్, కోన అప్పలరాజు, ఆర్. ఎస్. వి రమణ, శ్రీకాంత్, రాపర్తి నర్సింగరావు, రాపర్తి వరహాలరావు(జగన్), సోషల్ మీడియా కన్వీనర్ కంచిబోయిన సంతోష్, వార్డులో ముఖ్య నాయకులు, కన్వీనర్లు, గృహ సారధులు, మరియు జీవీఎంసీ అధికారులు, సచివాలయం సిబ్బంది, ఆర్పీలు, వాలంటీర్స్, తదితరులు పాల్గొన్నారు.